నీ జీవితములో గమ్యంబుయేదో ఒకసారి యోచించవా
Lyrics:
Singer:
Reference: ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. 2 కొరింథీయులకు Corinthians 6:3
పల్లవి: నీ జీవితములో – గమ్యంబుయేదో – ఒకసారి యోచించవా
ఈనాడే నీవు ప్రభుయేసుకొరకు – నీ హృదయమర్పింపవా
1. నీ తల్లి గర్భమున నుండినపుడే – నిను చూచె ప్రభు కన్నులు (2)
యోచించినావా ఏ రీతినిన్ను – నిర్మించె తన చేతులు
2. నీలోన తాను నివసింపగోరి – దినమెల్ల చేజాచెను
హృదయంపు తలుపు – తెరువంగ లేవా యేసు ప్రవేశింపను
3. తన చేతులందు రుధిరంపుధారల్ – స్రవియించె నీ కోసమే
భరియించె శిక్ష నీ కోసమేగా – ఒకసారి గమనించవా
4. ప్రభుయేసు నిన్ను సంధించినట్టి సమయంబు ఈనాడేగా
ఈ చోట నుండి ప్రభుయేసు లేక – పోబోకుమో సోదరా!